ఆకస్మికంగా బదిలీ ఉత్తర్వులు నెగ్గిన ప్రజాప్రతినిధుల పంతం ఐటీడీఏ పీవోకు ఇన్‌చార్జ్ బాధ్యతలు కలెక్టర్, జేసీ, రెవెన్యూ యంత్రాంగంపై వరుస దాడి ముందే చెప్పిన ‘సాక్షి’
‘రెడ్డి’లంటూ దాడి..ఆ తర్వాత ఎవరు?
సాక్షి, పార్వతీపురం మన్యం:
అనుకున్నదే జరిగింది.. అనుమానమే నిజ మైంది. జిల్లాలోని ఐఏఎస్‌లు, రెవెన్యూ యంత్రాంగం లక్ష్యంగా కొద్దిరోజుల నుంచి ప్రజాప్రతినిధులు విమర్శల దాడికి దిగుతున్న విషయం విదితమే. కలెక్టరు బదిలీకి కుతంత్రం పన్నుతున్నారన్న కోణం..జిల్లా ఉన్నతాధికారులపై అభాండాల అస్త్రం ప్రయోగిస్తున్నారన్న నేపథ్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ప్రజాప్రతినిధుల పంతానికి, అధికార దాష్టీకానికి జేసీ బలైపోయారా? అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది. రెవెన్యూ యంత్రాంగాన్నే లక్ష్యంగా చేసుకున్న కూటమి నేతలు..రెవెన్యూకు జిల్లా బాస్ అయిన సంయుక్త కలెక్టర్‌పై వేటు వేయించి, పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే జీవోలో తక్షణ అమలు కింద పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.వైశాలికి జేసీ ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆమె ఈ పోస్టులో కొనసాగుతారని పేర్కొన్నారు. కేవలం ఈ ఒక్క పోస్టు కోసమే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ కావడం..అధికార వర్గాలను విస్మయానికి గురిచేసింది. దీని వెనుక బలమైన కారణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అడ్డగోలు వ్యవహారాలకు తెర తీశారు. ఇసుక, మైనింగ్ వంటివాటిలో చెలరేగిపోయారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. స్థల వివాదాల్లో తలదూర్చారు. వారి అక్రమాలకు రెవెన్యూ సహకారం అవసరం. వారి చెప్పిన పనికల్లా జిల్లా బాస్‌లు తలాడించాలన్న ధోరణికి ప్రజాప్రతినిధులు వచ్చేశారు. కొన్ని విషయాల్లో అధికార యంత్రాంగం సహకరించినప్పటికీ.. ఇంకొన్నిచోట్ల ససేమిరా అన్నారు. అడ్డగోలు రిజిస్ట్రేషన్లపై విచారణకు ఆదేశించారు. ఆక్రమణ దారులకు నోటీసులిచ్చారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థల వివాదం మరింత రచ్చకెక్కింది. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను అధికా రుల వైపు మళ్లించారు. ఇసుక తవ్వకాల విషయంలో అధికారులపై వ్యూహాత్మకంగా బురద చల్లించా రు. అధికార పార్టీకి చెందిన ఓ నేత తన ఇంటి అవసరాల కోసమని ఇసుకను తరలిస్తుండగా..అధికారులు ఆ ట్రాక్టర్లను పట్టుకున్నారు. దీన్ని సహించలేక, అధికారులే ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతున్నారని ఓ ప్రజాప్రతినిధి ప్రచారం చేయించారు. రెవెన్యూ దస్త్రాల విషయంలో సంతకాల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. వారికి నచ్చని తహసీల్దార్లను బదిలీ చేయించా లని పట్టుబట్టా రు. ఈ అడ్డగోలు వ్యవహారాలన్నీ తాము అనుకున్నట్లు సకాలంలో జరగలేదన్న కోపంతో కలెక్టర్, జేసీల మీద పంతం పట్టారు.
●ఇవన్నీ ఒక ఎత్తయితే.. సాలూరులో జాతీయ రహదారిని ఆనుకుని రూ.కోట్ల విలువైన సొసైటీకి చెందిన స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం..పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుతో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి విచారణకు ఆదేశించడం కీలక మలుపుగా భావిస్తున్నారు. సుమారు మూడెకరాలకు పైగా ఉన్న ఈ స్థలం విషయంలో అధికార పార్టీకి చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు వినిపిస్తోంది. అందులో 50 సెంట్ల కోసం ఓ నేత పట్టుపట్టినట్లు తెలుస్తోంది. సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్కెట్ విలువ తక్కువ చేసి మరీ, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం, తహసీల్దారు కార్యాలయంలో నిబంధనలను పక్కనపెట్టి మ్యుటేషన్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి.. శనివారం జిల్లా సబ్ రిజిస్ట్రార్‌ను మరోసారి విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అందులో భాగం
వాస్తవానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి బదిలీకి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నించారు. జిల్లాలో ‘రెడ్డి’ల సామ్రాజ్యం నడుస్తోందంటూ ఒక దుష్ప్రచారానికి దిగారు. చివరన ‘రెడ్డి’ అనే పదం ఉంటే చాలు.. మారుమూల ప్రాంతంలో పడేస్తున్నారని అధికారులు గగ్గోలు పెడుతోంటే.. జిల్లా ప్రజాప్రతినిధులు కొత్త భాష్యం వెతికి, ఎస్సీ–ఎస్టీల నియోజకవర్గంలో ‘రెడ్డి’ల పెత్తనమేమిటన్న వితండ వాదన తీసుకొచ్చారు. వారు అనుకున్నట్లుగానే జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేయించారు. ఆ తర్వాత స్థానంలో ఏ ‘రెడ్డి’ ఉంటారోనన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో నడుస్తోంది. సీతంపేట ఐటీడీఏ పీవోగా జిల్లాకు వచ్చిన యశ్వంత్‌కుమార్‌రెడ్డి.. తర్వాత జరిగిన బదిలీల్లో సంయుక్త కలెక్టరుగా నియమితులయ్యారు. పాలనపారమైన వ్యవహారాల్లో కచ్చితంగా ఉంటారని..సౌమ్యుడు, వివాదరహితుడన్న పేరు పొందారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే ఆయనను ఆకస్మికంగా బదిలీ చేయడం..ఏపీఐఐసీ ఈడీగా అప్రాధాన్య పోస్టులో నియమించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
గా జనసేన పార్టీకి చెందిన ఫిర్యాదుదారు, న్యాయవాది రేగు మహేశ్వరరావుతో పాటు.. కొనుగోలుదారులు, అమ్మకందారులు..ఇలా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేశారు. ఈ స్థల వివాదం కదులుతుండగానే..జేసీ బదిలీకి అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు వినిపిస్తోంది.
కొమరాడ మండలం గుమడ, సీలేసు పరిధిలోని భూముల్లో మైనింగ్, రెవెన్యూ ఉన్నతాధికారులు అక్రమ తవ్వకాలు చేస్తున్నారని కొంతమంది గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. దీనిపై గతంలో కలెక్టర్, జేసీ, సబ్‌కలెక్టర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కలెక్టర్, జేసీ స్పందించకపోవడంతోనే చంద్రబాబునాయుడుకు, నీటిపారుదల శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామని చెప్పు కొచ్చారు. వారి వెనుక కూడా ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదును తమకు అందించలేదని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. పథకం ప్రకారం చేసిన ఈ ఫిర్యాదు కూడా జేసీ బదిలీకి కారణంగా తెలుస్తోంది.


