మార్కెట్‌కు మన్యం గుమ్మడి
● సైజును బట్టి రూ.40 వరకు విక్రయం
సీతంపేట: మన్యంలో గుమ్మడి సీజన్ ఆరంభమైంది. మార్కెట్, సంతల్లో గిరిజన రైతులు విక్రయిస్తున్నారు. సైజ బట్టి రూ.20 నుంచి రూ.40 మధ్యన ఒక్కో గుమ్మడి కాయ ధర పలుకుతోంది. పర్లాఖిమిడి, బరంపురం ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో భాగంగా సుమారు 100 ఎకరాల్లో గుమ్మడిపంటను పండిస్తునానరు. దిగుబడి బాగున్నా ధర లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గతేడాది ఒక్కో పండు రూ.50 వరకు ధర పలకగా ఈ ఏడాది ధర తగ్గిందంటూ వాపోతున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి గుమ్మడి వంటి అటవీ ఉత్పత్తులను కొండలపై నుంచి మోసుకురావడమే మిగులుతోంది. గిట్టుబాటు ధర లభించడం లేదు. తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక వ్యాపారులు అడిగిన ధరకే విక్రయిస్తున్నాం. – ఎస్.తోటయ్య, గొయ్యిగూడ
ఈ ఏడాది అటవీఉత్పత్తుల ధరలన్నీ తగ్గుముఖం పట్టాయి. గిరిజన రైతులకు నష్టాలు తప్పడంలేదు. కొన్నిపంటలకు పెట్టుబడి కూడా రావడంలేదు. ప్రభుత్వ పరంగా గిరిజనులను ఆదుకోవాలి.
– ఎస్.మోజేషు, లంబగూడ


