ప్రైవేటీకరణపై నిరసన
భామిని: వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ప్రజలు నిరసన తెలుపుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. భామిని మండలంలోని 27 పంచాయతీల పరిధిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజల నిరసన తెలిపారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండల వ్యాప్తంగా 17,500 మంది సంతకాలు చేశారు. వీటిని గవర్నర్‌కు చేర్చాలని వైఎస్సార్‌సీపీ నాయకులను కోరారు. తాలాడలో ఎమ్మెల్సీ విక్రాంత్‌తో కలిసి సంతకాలు చేసిన ప్రతులను ప్రదర్శించారు.


