దోమతెరలు పాడయ్యాయి..
వాస్తవానికి దోమతెరల కాలపరిమితి ఐదేళ్లు. దోమతెరలను ఉతకడం వంటివి చేస్తే మూడేళ్లకే పాడవుతాయి. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజల వద్ద ఉన్న దోమ తెరలు పాడయ్యాయి. కొన్ని గ్రామల్లో వీటిని చేపల వేటకు, పూలమొక్కలు, ఇళ్లకు కర్టైన్‌లుగా, ద్విచక్రవాహనాలు కప్పేందుకు వినియోగిస్తున్నారు. ఏజెన్సీలో ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు మలేరియా వ్యాప్తి చెందుతుంది. ఈ కాలంలో ఇక్కడి ప్రజలు దోమ తెరలు వినియోగం తప్పనిసరి. సీజన్ ముగిసినా ఇప్పటికీ దోమతెరలు సరఫరా చేయకపోవడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


