అడుగడుగునా ఇబ్బందులే...
సాక్షి, పార్వతీపురం మన్యం/భామిని/పాలకొండ రూరల్: మెగా పేరెంట్– టీచర్ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో అడుగడుగునా ప్రజలకు ఇబ్బందులే ఎదురయ్యాయి. పాలకొండ నియోజకవర్గం భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యా రు. ఉదయం 10.50 గంటల సమయంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అంతకు అరగంట ముందుగానే అలికాం బత్తిలి రహదారిలో రాకపోక లు నిలిపివేశారు. ఆయన వేదిక వద్దకు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బస్సులను ఆ మార్గంలో విడిచి పెట్టారు. దీంతో ప్రయాణికులు, అటుగా నాలుగు చక్రాల వాహనాల్లో రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదచారులను కూడా చాలా సమయం వరకు నిలిపి వేశారు. ఆ తర్వాత ఒకేసారి వదిలేయడంతో రద్దీ పెరిగింది.
హెలిప్యాడ్ మార్గంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి అవమానం జరిగింది. చంద్రబాబు వస్తారని ముందుగానే రహదారిని బ్లాక్ చేసిన పోలీసులు.. అదే సమయంలో అటువైపు వచ్చిన విప్ తోయక జగదీశ్వరిని కూడా విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగి.. తన కారులోనే చాలా సేపు ఉండిపోయారు. సీఎం సమావేశ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లిన కొద్ది సేపటికి విడిచిపెట్టారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇతర టీడీపీ నాయకులు కూడా ఆయన్ను కలిసేందుకు వచ్చి, కుదరక వెనుదిరిగారు.
ముఖ్యమంత్రి పర్యటనలోనూ కూటమిలో వర్గ విబే ధాలు చల్లారలేదు. చంద్రబాబు పర్యటన సమ యంలో ఎక్కడా జనసేన జెండాలు కనిపించలేదు. వారి హడావిడి కానరాలేదు. ఇక్కడ టీడీపీలోనూ రెండు వర్గాలు ఉన్న విషయం విదితమే. ముందు రోజు రాత్రి పార్టీ శ్రేణులతో మంత్రి లోకేశ్ సమావేశమై హితోపదేశం చేసినప్పటికీ.. పరిస్థితిలో మా ర్పు రాలేదని స్పష్టమైంది. సీఎం స్వాగత ఫ్లెక్సీల సందర్భంలోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి వర్గానికి అంతగా ప్రాధాన్యం దక్కలేదు. ఒకరి ఫ్లెక్సీల్లో ఇంకొకరి జాడ లేదు. మరోవైపు హెలిప్యాడ్ నుంచి ఆదర్శ పాఠశాల వరకూ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఫ్లెక్సీలే రహదారికి ఇరువైపులా దర్శనమిచ్చాయి. అందులోనూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్, జిల్లా మంత్రి సంధ్యారాణి, ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డు, నాగబాబు ఫొటోలు వేసుకున్న ఆయన.. ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల చిత్రాలేవీ లేకుండా జాగ్రత్త పడ్డారు. తన గురువు అయిన కళా వెంకటరావు ఫొటోను మాత్రం వేయడం గమనార్హం. ఇదే సమయంలో నియోజక వర్గ ఇన్చార్జి పడాల భూదేవి వర్గం వేసిన ఫ్లెక్సీలను రహదారి పక్కన పడేయడం.. వర్గ పోరును తేటతెల్లం చేసింది.
సీఎం పర్యటనలో జిల్లా మంత్రి సంధ్యారాణి జాడ లేదు. ముందు రోజు పార్టీ నియోజక వర్గ శ్రేణులతో లోకేశ్ నిర్వహించిన సమావేశంలో ఆమెతోపాటు.. ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సీఎం కార్యక్రమానికి ఆమె రాకపోవడం చర్చనీయాంశమైంది. పేరెంట్–టీచర్ మీట్‌లో నియోజక వర్గ ఎమ్మెల్యే జయకృష్ణ, టీడీపీ ఇన్‌చార్జి భూదేవి మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌తో కలిసి పాల్గొన్నారు. ఇతర నాయకులను ఎవరినీ అనుమతించలేదు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. వీరేష్ చంద్రదేవ్, భూదేవి వంటివారు కనిపించారు. జిల్లా మంత్రిగా సంధ్యారాణి కనిపించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల మంత్రి పీఏ, కుమారుడి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచ
లనం కలిగించిన విషయం విదితమే. అధిష్టానం నుంచి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెను దూరం పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అడుగడుగునా ఇబ్బందులే...


