బీసీ, ఓబీసీ ఉద్యోగుల ఐక్యతకు కొత్త కార్యవర్గం
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా యూనిట్ కార్యవర్గ ఎన్నికలు శనివారం స్ధానిక రెవెన్యూ హోమ్‌లో నిర్వహించారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పక్కి భూషణ్‌రావు అధ్యక్షతన చేపట్టగా, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఖజానాధికారి వై.శంకరరావు, ఎన్నికల అధికారి, సంఘ లీగల్ అడ్వైజర్ పి.రామచంద్రరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా బీసీ, ఓబీసీకి చెందిన వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్షుడుగా వివిఆర్.జగన్నాధరావు(రెవెన్యూ), కార్యదర్మిగా ఎం.ఆదినారాయణ(ట్రెజరీ శాఖ), ఖజానాధికారిగా ఎస్.బంగారు రాజు(సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం), అసోసియేట్ అధ్యక్షుడుగా ఎం.బలరాంనాయుడు(సహకార సంస్థలు, హెచ్‌ఆర్), ఆర్గనైజింగ్ కార్యదర్మిగా బి.శ్రీనివాసరావు(విద్యా శాఖ), ఉపాధ్యక్షులుగా కె.నరేంద్ర(పంచాయతీ రాజ్), కె.పాపారావు(అటవీ శాఖ), డాక్టర్ ప్రవీణ్‌కుమార్(ఆర్టీసీ వైద్యశాల), ఎం.ఎస్.గౌరీదేవి(పశుసంవర్ధక శాఖ), కేపీ నాయుడు(ఆర్‌అండ్‌బీ), పంచాయతీ కార్యదర్ములు విభాగానికి పి.శివరామకృష్ణ, జాయింట్ కార్యదర్శులుగా పతివాడ శ్రీనివాసరావు(పోస్టల్), బి.మోహన్ నాయుడు(బీఎస్‌ఎన్‌ఎల్), సీఎన్.శేఖర్(న్యాయ విభాగం), వెంకటరావు(దేవదాయ శాఖ), ఎం.తాతయ్య(ఆర్టీసీ కండక్టర్లు) ఎంపికయ్యారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.బాలభాస్కర్, శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు డి.చక్రపాణి, శ్రీకాకుళం అధ్యక్ష, కార్యదర్ములు, ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్మి ఎల్‌వి.యుగందర్ తదితరులు హాజరయ్యారు.
వివిధ శాఖల నుంచి ఏకగ్రీవ ఎంపిక


