తగిన ఫలితం దక్కడం లేదు
ఆరుగాలం శ్రమించి అతి కష్టం మీద విత్తనాలు, యూరియా, ఎరువులు సేకరించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. తుఫాన్ వంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని నిలబడ్డాం. తీరా అతి కష్టం మీద పంటను ఇంటికి తీసుకువస్తే.. ఇప్పుడు సరైన కొనుగోలు అవకాశాలు లేక, ధాన్యం నిల్వలను దాచుకొనే పరిస్థితి లేక వాతావరణంలో వస్తున్న మార్పులకు భయపడి తక్కువ ధరకే నష్టాన్ని భరిస్తూ దళారులకు అమ్ముకోవల్సి వస్తుంది. ప్రభుత్వం ముందస్తు ఆలోచనలు, ప్రణాళికలు చేసి ప్రకృతి వైపరీత్యాల సైతం దృష్టిలో పెట్టుకొని కొనుగోలు ప్రారంభించి ఉంటే రైతులకు కొంతమేరకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించేది కాదు.
– ఎస్.శేషగిరిరావు, కౌలు రైతు, వెంకంపేట


