పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత
విజయనగరం క్రైమ్: పోలీసు కంట్రోల్ రూంలో హెచ్‌సీగా పని చేసి, ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన ఎస్.సత్యనారాయణ కుటుంబానికి జిల్లా పోలీసు శాఖలో పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సమకూర్చిన రూ.1,48,000ల చెక్‌ను ఆయన భార్య ఎస్.త్రివేణికి ఎస్పీ దామోదర్ డీపీవోలో శుక్రవారం అందజేశారు. దీంతో పాటు పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ సభ్యత్వం ఉండడంతో ఫ్యునరల్ ఖర్చుల నిమిత్తం రూ.30వేలు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో దాచుకున్న రూ.1,05,906ల చెక్కులను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో చేస్తున్న ఈ సాయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏవో పి.శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, అడహక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, కో ఆపరేటివ్ కార్యదర్శి నాయుడు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


