రైల్వేస్టేషన్ క్యాంపు కోర్టులో 256 కేసుల పరిష్కారం
బొబ్బిలి: స్థానిక రైల్వేస్టేషన్‌లో విశాఖ ఫస్ట్ క్లాస్ అడిషనల్ సివిల్ జడ్జి జి.కార్తీక్ ఆధ్వర్యంలో రైల్వే క్యాంపు కోర్టును నిర్వహించారు. బొబ్బిలి ఆర్‌పీఎఫ్ పోస్టు పరిధిలోని గరుగుబిల్లి, కూనేరు రైల్వేస్టేషన్‌ల మధ్య రైల్వే నిబంధనలను అతిక్రమించిన ప్రయాణికులు, ఇతరులపై వివిధ సెక్షన్ల కింద నమోదయిన 256 పెట్టీ కేసులను క్యాంపు కోర్టులో పరిష్కరించారు. రైల్వే లైను, స్టేషన్ల పరిధిలో జరిగిన నిబంధనల అతిక్రమణలపై ఆయా కక్షిదారులకు జరిమానాలు విధించారు. అలాగే నిబంధనలను పాటించాల్సిన అవసరం అందరికీ ఉందని వారిని చైతన్యపరిచారు. రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


