వల్లంపూడిలో పట్టపగలే దొంగతనం
వేపాడ: మండలంలోని వల్లంపూడి గ్రామంలో శుక్రవారం పట్టపగలే దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. వల్లంపూడి గ్రామానికి చెందిన నమ్మి వెంకటరావు ఉదయం 5.30 గంటలకు ఇంటి నుంచి కల్లానికి వెళ్లగా ఉదయం 11.30 గంటల సమయంలో వెంకటరావు కుమారుడు విష్ణు ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి గుర్తు తెలియని దొంగలు ఇంటిలోకి చొరబడి బీరువా పగులకొట్టి బీరువాలో వున్న బంగారం చైన్, బంగారం చెవి బుట్టలు రెండు సుమారు తులం పావు, ఒక జత పట్టీలు దొంగలించుపోయినట్టు గుర్తించాడు. ఈ విషయాన్ని విష్ణు తన తండ్రి వెంకటరావుకు ఫోన్ చేసి చెప్పగా ఇంటికి చేరుకున్న వెంకటరావు ఇంటిని పరిశీలించిన పిదప తమకు ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ సుదర్శన్ తెలిపారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


