159 మంది గ్రేడ్‌ –3 ఏఎన్‌ఎంలకు పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

159 మంది గ్రేడ్‌ –3 ఏఎన్‌ఎంలకు పదోన్నతి

Nov 8 2025 7:54 AM | Updated on Nov 8 2025 7:54 AM

159 మ

159 మంది గ్రేడ్‌ –3 ఏఎన్‌ఎంలకు పదోన్నతి

విజయనగరం ఫోర్ట్‌: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పని చేస్తున్న ఎంపీహెచ్‌ఏ( ఫీమేల్‌), ఏఎన్‌ఎంలకు ఎంపీహెచ్‌ఏ(రెగ్యులర్‌) పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కమిటీ సభ్యులు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి పదోన్నతులు కల్పించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, మున్సిపల్‌ కమిషనర్‌ నల్లనయ్య, జెడ్పీ సీఈవో బి.వి.సత్యనారాయణ, డీపీవో బాలాజీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సూర్యనారాయణ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 159 మందికి పదోన్నతి కల్పించారు. పదోన్నతి ఉత్తర్వులు వారికి మెయిల్‌ ద్వారా పంపిస్తున్నట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి తెలిపారు.

క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి

పార్వతీపురం: ఏపీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో గల ప్రభుత్వ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులకు (పురుషులు, మహిళలు) ఈ నెల 12న నిర్వహించే క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డా.కె.శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు. ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అథ్లెటిక్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, క్యారమ్‌, చెస్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, ఖోఖో, హాకీ, కబడ్డీ, టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, రెజ్లింగ్‌, స్విమ్మింగ్‌, యోగ, డ్యాన్స్‌ తదితర అంశాలలో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్టు తెలిపారు. సమాచారం కోసం కె.గణేష్‌ (హేడ్‌బాల్‌ శిక్షకులు) మొబైల్‌ 9866805716 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

యువతకు రుణ అవకాశం

పార్వతీపురం: సఫాయి కర్మచారి వృత్తిలో వున్న నిరుద్యోగ యువతకు ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకంలో సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేయనున్నట్టు జిల్లా షెడ్యూల్డ్‌ కులముల సేవా సహకార సంస్థ, ఇన్‌చార్జ్‌ కార్యనిర్వాహక సంచాలకులు ఎం.శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం 2023లో జిల్లాకు మంజూరు చేసిన 3వేల లీటర్ల సామర్థ్యం గల సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ మూడు వాహనాలను షరతులతో తిరిగి మంజూరు చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి వున్న వారు డా.మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్‌, విజయనగరానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9030014742, 9642460838, 9652600967 నంబర్లను సంప్రదించాలన్నారు.

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌

పోటీలకు జిల్లా జట్టు

బొబ్బిలి: గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్టు బయలుదేరి వెళ్లింది. శుక్రవారం ఇక్కడి రైల్వేస్టేషన్‌లో సాఫ్ట్‌బాల్‌ జిల్లా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సుంకర సాయి రమేష్‌, కోశాధికారి, పీడీ ఎన్‌.వెంకటనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల వారం రోజుల పాటు రాష్ట్ర స్థాయి జట్టును ఎంపిక చేసి కోచింగ్‌ ఇచ్చామన్నారు. ఇందుకోసం తెర్లాంలో కోచింగ్‌ క్యాంపును కూడా నిర్వహించినట్టు తెలిపారు. బొత్స కిశోర్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొని జట్టు సభ్యులకు ఆల్‌ద బెస్ట్‌ తెలుపుతూ రాష్ట్ర స్థాయి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

బెల్లం ఊట ధ్వంసం

సీతంపేట: మండలంలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1200 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్టు ఎస్‌ఐ షేఖ్‌ మస్తాన్‌ తెలిపారు. తాడిపాయి పరిసర కొండ ప్రాంతాల్లో సారా వంటకాలు చేస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించగా డ్రమ్ములతో ఉంచిన బెల్లం ఊటలు దొరకడంతో ద్వంసం చేసినట్టు తెలిపారు. డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

159 మంది గ్రేడ్‌ –3  ఏఎన్‌ఎంలకు పదోన్నతి 1
1/2

159 మంది గ్రేడ్‌ –3 ఏఎన్‌ఎంలకు పదోన్నతి

159 మంది గ్రేడ్‌ –3  ఏఎన్‌ఎంలకు పదోన్నతి 2
2/2

159 మంది గ్రేడ్‌ –3 ఏఎన్‌ఎంలకు పదోన్నతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement