అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా అండర్–14 జట్టు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో అండర్–14 విభాగంలో బాల, బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే 30 మంది క్రీడాకారుల బృందం విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి క్రీడాకారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జట్టు కోచ్ అండ్ మేనేజర్‌లు వి.ఆనందకిషోర్, ఎం.రామకృష్ణ, పి.భారతి పాల్గొన్నారు.
విజయవాడలో నెట్‌బాల్ పోటీలు
ఈ నెల 8, 9, 10 తేదీల్లో విజయవాడలో జరగనున్న స్కూల్ గేమ్స్ అండర్–17 బాల, బాలికల నెట్‌బాల్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో జిల్లా జట్లు విజేతలుగా తిరిగి రావాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జట్టు కోచ్ అండ్ మేనేజర్‌లు మెహర్, శ్రీకాంత్, వాసు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా అండర్–14 జట్టు


