వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే కృషి
విజయనగరం అర్బన్: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని ఆ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు వెల్లడించారు. ఎన్నికై బాధ్యతలు తీసుకున్న తరువాత జిల్లాకు వచ్చిన ఆయన శుక్రవారం స్థానిక ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఫిబ్రవరిలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జాతీయ సమావేశాలు విజయవాడలో జరగనున్నాయని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తానని చెప్పారు. విజయనగరంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్టు ఎవరికై నా ఎలాంటి సహాయం అవసరమైతే కమిటీ సభ్యులు అందిస్తారని తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీ, రాష్ట్ర యూనియన్ కమిటీలలో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని నిబద్దత గల యూనియన్‌గా రాష్ట్ర సంఘంలో గుర్తింపు ఉందని ఆయన అన్నారు. ఆయనను సంఘం జిల్లా కమిటీ ఘనంగా సత్కరించింది. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంఎస్‌ఎస్ రాజు, కౌన్సిల్ సభ్యుడు టి.రాధాకృష్ణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు వేదుల సత్యనారాయణ, జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో, కార్యదర్శి డేవిడ్ రాజు, జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు పంచాది అప్పారావు, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కేజేశ ర్మ, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎల్.నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.


