కేన్సర్‌పై ముందుస్తు తనిఖీలు చేసుకోవాలి
విజయనగరం ఫోర్ట్: కేన్సర్ మీద ముందుస్తు తనిఖీలు చేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం జాతీయ కేన్సర్ అవగాహన దినం సందర్బంగా నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేన్సర్ లక్షణాలు ఉంటే జీజీహెచ్ కేన్సర్ విభాగంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కేన్సర్ వ్యాధి ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. కేన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాత నిర్ధారణ అవుతుందన్నారు. నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే కేన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతుందన్నారు. పొగాకు, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్పెక్షన్లు ద్వారా కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీఎల్‌వో డాక్టర్ కె.రాణి, డీఐవో డాక్టర్ అచ్చుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సూర్యనారాయణ, ఎన్‌సీడీ పి. ఒ.డాక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి


