ముగిసిన ఐవోటీ శిక్షణ
విజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ జీవీ, చైన్నె జాతీయ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ, విశాఖపట్నం నైపుణ్యాలు, సామర్థ్యాల మండలి సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) శిక్షణ శుక్రవారం ముగిసింది. జేఎన్టీయూ జీవీలో రెండు వారాల పాటు డిజిటల్ విధానంపై ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ అందించారు. జేఎన్టీయూ జ వీలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఉపకులపతి వి.వి.సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ధ్రువపత్రాల కంటే నైపుణ్యమే ముఖ్యమైందన్నారు. ఉద్యోగ అవకాశాలకు నైపుణ్యాలు అవసరమని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన ఉద్యోగులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ టి.ఎస్.ఎన్.మూర్తి, కోఆర్డినేటర్ డబ్ల్యూ.అనిల్, ఎన్‌ఐఈ ఎల్‌టీ ప్రతినిధులు ఇశాంత్‌కుమార్ బజ్‌పాయి, ప్రశాంత్, సీఎస్సీ ఇండియా ప్రతినిధి రామ్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


