రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

Nov 8 2025 7:10 AM | Updated on Nov 8 2025 7:10 AM

రాష్ట

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

సీతానగరం: ఏపీ స్టేట్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ 2025–26 (అండర్‌ 14, 17, 19 బాల బాలికలు) పోటీలను సీతానగరం మండలం జోగింపేట ఏపీ గిరిజన సంక్షేమ పాఠశాలలో కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఖర్చులేని ఆటల్లో చదరంగం ఒకటని, పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి ఆటను నేర్చుకోవాలని ఉద్బోధించారు. రాష్ట్రస్థాయి పోటీలకు పార్వతీపురం మన్యం జిల్లా ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. చెస్‌తో మెదడు చురుకుదనం పెరుగుతుందన్నారు. క్రీడాకారులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ బి.రాజ్‌కుమార్‌, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఆర్‌.తేజేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

10న ‘చలో సాలూరు’

గుమ్మలక్ష్మీపురం: అనారోగ్యంతో మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన ‘చలో సాలూరు’ కార్యక్రమం పేరుతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటిని ముట్టడిస్తామని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టంచేశారు. గుమ్మలక్ష్మీపురం గిరిజన సంఘం కార్యా లయం వద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఏపీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మండంగి రమణ, మండల సహాయ కార్యదర్శి ఎం.సన్యాసిరావు, ఎస్‌ఎఫ్‌ఐ మండలాధ్యక్షుడు ఎ.గంగారావు, యువజన సంఘం మండలాధ్యక్షుడు కె.గంగారావు మాట్లాడారు. విద్యార్థులను పోగొట్టుకున్న కుటుంబాలకు ప్రభుత్వం కనీస పరిహార చర్యలు అందజేయకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి, గెలిచాక చేసిన మొదటి సంతకంను నెరవేర్చకుండా మంత్రి గిరిజనులను మోసంచేస్తున్నారన్నారు. విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు తక్షణమే ఏఎన్‌ఎంలను నియమించాలన్న డిమాండ్‌తో చలో సాలూరు కార్యక్రమానికి పిలుపునిచ్చామ న్నారు. గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈనెల 9వ తేదీలోగా పై రెండు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గిరి జన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేకూర్చేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమానికి గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు, గిరిజన పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి

పార్వతీపురం రూరల్‌: కార్తిక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవాలయాల్లో భక్తులకు భద్రత కల్పించడంతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి దేవదాయశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నారు. భద్రతా పరమైన ఏర్పాట్లు మేరకు దాతల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గర్భ గుడిలోకి పరిమితంగానే భక్తులను అనుమతించాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన్యం అందాలకు ట్రెక్కింగ్‌ హంగులు

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని పర్యాటక అందాలకు ట్రెక్కింగ్‌ హంగులు కల్పిస్తున్నట్టు కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. టూరిజం గైడ్‌లుగా ఎంపికై న గిరిజన యువతకు కలెక్టరేట్‌లో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 12 ట్రెక్కింగ్‌ ప్రాంతాల్లో మొదటి దశగా ఆరు ప్రాంతాలను సిద్ధం చేస్తున్నామని, పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని గైడ్‌లకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటకులకు ఆహారం, రాత్రి బస, క్యాంపు ఫైర్‌ వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి విస్తృత ప్రచారం కల్పించాలని అటవీశాఖను ఆదేశించారు.

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం 1
1/1

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement