● ప్రకృతి అందాలకు నెలవు మడ్డువలస పరిసరాలు ● ఆహ్లాదకర వా
వంగర: కార్తిక పుణ్యమాసంలో వనసమారాధకులను వంగర మండలం మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు పరిసరాలు రారమ్మంటున్నాయి. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రాజెక్టులో నిండుగా ఉన్న నీరు, నీటిని ఆనుకొని చుట్టూ ఉన్న కొండలు చూపరులకు కనువిందు చేస్తున్నా యి. సాయంకాల సమయంలో వీచే పిల్లగాలు లు సందర్శకులను ఆహ్లాదపరుస్తున్నాయి. సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రాజెక్టు ప్రవేశ ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఉన్న రహదారి అందరినీ మైమరిపిస్తుంది. ప్రాజెక్టు పరిసరాల్లోని కొండలపై నిర్మించిన షిర్డి సాయినాథుని ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది.
తిలకించాల్సిన ప్రదేశాలు....
ప్రాజెక్టు వద్ద బకెట్‌పోర్షన్, నీటిమట్టాన్ని సూచించే ప్రదేశం, ప్రాజెక్టు ఆవరణలో ఉన్న డైక్, కొండపై నిర్మించిన సాయినాథుని ఆలయం, కొండపై ఉన్న పాండవుల పంచను తిలకించవచ్చు. మడ్డువలసకు ఆనుకొని పచ్చనితోటలు పిక్నిక్‌లు నిర్వహించేందుకు అనువుగా ఉంటాయి.


