స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తినిచ్చిన గేయం..
● ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన గేయం వందేమాతరం అని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి అన్నారు. గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్‌బీ సీఐ రమణమూర్తి, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


