విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
సీతంపేట: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ఐటీడీఏ గ్రీన్‌ఫీల్డ్ క్రీడా మైదానంలో మూడు క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. మెదడు మరింత ఉత్తేజంగా ఉంటుందని, క్లస్టర్, ఐటీడీఏ స్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయిలో ఉన్నతంగా రాణించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు.


