రాజాం సిటీ: పట్టణ పరిధిలోని కాలెపు వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్, సివిల్ సప్‌లైస్ అధికారులు గురువారం పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని విజిలెన్స్ ఎస్సై రామారావు తెలిపారు. ఈ దాడిలో వ్యాపారి అప్పలరాజు ఇంట్లో నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఎ కేసు నమోదుచేశామన్నారు. రేషన్ బియ్యాన్ని అమ్మడం, కొనడం చేస్తే చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌డీటీ అనంత్‌కుమార్, వీఆర్వో అబ్బాస్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ల సహాయంతో సారా బట్టీల ధ్వంసం
సాలూరు రూరల్: మండలంలో సారా అక్రమ తయారీ కేంద్రాలపై ఎకై ్సజ్, పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా గురువారం డ్రోన్ల సహాయంతో సారా బట్టీలను గుర్తించి ధ్వంసం చేసినట్లు రూరల్ ఎస్సై నర్సింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు చేసిన దాడుల్లో దొరలతాడివలస, సుల్లరి గ్రామాలలో గుర్తించిన సారా బట్టీల్లో 7,200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని చెప్పారు.
శృంగవరపుకోట: మండల పరిధిలోని మల్లిపూడి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి క్వారీ గోతిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కిల్లో నర్సమ్మ కొడుకు కిల్లో రాజు(33) గొర్రెలు కాపలా కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి గొర్రెలమంద ఉన్న ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఉన్న క్వారీ గోతిలో పడి ప్రాణాలు వదిలాడు. గురువారం ఉదయం కొందరు స్థానికులు క్వారీ గోతిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ చేసి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట ఎస్సై తెలిపారు.
గెడ్డలో పడి వృద్ధురాలు
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి సారథి గ్రామానికి చెందిన యండమూరి గౌరమ్మ (60) గ్రామ సమీపంలోని గెడ్డలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎప్పటిలాగానే గురువారం గ్రామ సమీపంలోని బుడబుడరాలు గెడ్డకు ఆమె స్నానానికి వెళ్లింది. అక్కడ తనకు బీపీ ఎక్కువ కావండంతో గెడ్డలో పడిపోయి మృతిచెందింది. అటుగా వెళ్లిన స్థానికులు పరిశీలించి కుటుంబసభ్యులకు ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.
8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత


