లాన్‌టెన్నిస్ పోటీల్లో సత్తా
● రాష్ట్రస్థాయి అండర్–17 విభాగంలో విజేత యశ్వంత్
● అభినందించిన గ్రామస్తులు
తెర్లాం: మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన బొమ్మి యశ్వంత్ రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీల్లో సత్తా చాటాడు. ఇటీవల శ్రీకాళహస్తిలోని విక్రం టెన్నిస్ అకాడమీలో 69వ ఏపీ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ లాన్ టెన్నిస్ అండర్–14,17,19 విభాగాల్లో పోటీలు జరిగాయి. అండర్–17 విభాగంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న యశ్వంత్ అత్యంత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు. యశ్వంత్ టెన్నిస్ క్రీడలో గతంలో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభను కనబరిచి రాణిస్తున్నాడు. ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన 69వ ఏపీ స్కూల్ గేమ్స్ పోటీల్లో అండర్–17 విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని సాధించాడు. బొబ్బిలి మాజీ ఏఎంసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి బొమ్మి శ్రీనివాసరావు కుమారుడు యశ్వంత్. లాన్‌టెన్నిస్‌లో యశ్వంత్ చూపిన ప్రతిభకు కుటుంబసభ్యులు, గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కూనాయవలస సర్పంచ్ బోడెల విజయబాబు అభినందించారు.


