జాతీయస్థాయిలో మోడల్‌స్కూల్ విద్యార్థి ప్రతిభ
డెంకాడ: మండలంలోని అక్కివరం పంచాయతీ పరిధి గొల్లపేట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి పతివాడ భానుప్రసాద్ జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌లో ప్రతిభ కనబరిచాడు. జాతీయస్థాయిలో 17వ స్థానంలో నిలినందుకు గాను అవార్డు, ప్రశంసాపత్రంతో పాటు సైన్స్ కిట్‌ను బహుమతిగా అందుకున్నాడు. ఈనెల 7,8 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న సైన్స్ ఎక్స్‌పోలో నాసా, రష్యన్ సైన్స్ కేంద్రాలను సందర్శించే అద్భుత అవకాశం పొందాడని కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య తెలిపారు. క్రమశిక్షణ, విద్యలో పతివాడ భానుప్రసాద్ ముందుకు సాగుతూ మోడల్ స్కూల్‌కు మంచి పేరు తీసుకురావడం హర్షణీయమని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన భానుప్రసాద్‌ను జిల్లా అధికారులతో పాటు ప్రిన్సిపాల్ సంధ్య, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు.


