నర్సింగ్ విద్యార్థులే దిక్కు..!
● ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉండని వైద్యులు! ● అవస్థలు పడుతున్న రోగులు ● ప్రజలకు అందని ప్రభుత్వ వైద్యం
ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవలే నేను బాధ్యతలు చేపట్టాను. ఆస్పత్రిలో ఉన్న లోపాలను సరిచేసి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాను. హాజరువేసి బయటకు వెళ్లే వైద్యులపై చర్యలు తీసుకుంటాం.
–కె.చిరంజీవి, ఆస్పత్రి సూపరింటెండెంట్
పాలకొండ:
డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో రోగులకు సేవలు అందక అవస్థలు పడుతున్నా రు. వందల సంఖ్యలో ప్రతిరోజూ ఆస్పత్రికి వస్తు న్న రోగులు ఉసూరుమంటూ తిరిగి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా త ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇందులో భాగంగా గతంలో జరిగిన బదీలీల్లో ఇక్కడ పనిచేస్తున్న వైద్యులను బదిలీ చేసింది. వారి స్థానంలో వచ్చిన వైద్యులు మొక్కుబడిగా ఇష్టంలేని విధులు నిర్వహిస్తున్నారు. ఒకరిద్దరు వైద్యులు మినహా మిగిలిన వారు ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రి కోసం తమ సమయం కేటాయించడంతో పాటు రోగుల ను విసిగించి ఆక్కడికి వెళ్లిపోయేలా చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో సేవలు అందకపోవడంపై ఇప్పటికే పలు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు పలుమార్లు పరిశీలన చేసి మందలించినప్పటికీ ఫలితం మాత్రం రావడంలేదు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో శిక్షణ కోసం వస్తున్న నర్సింగ్ విద్యార్థి నులే రోగులకు దిక్కుగా మారారు. వారు రోజుకు సమారు 80 మంది మూడు షిఫ్టుల్లో ఇక్కడ శిక్షణ కోసం వస్తున్నారు. వారితోనే ప్రస్తుతం ఆస్పత్రిలో సేవలు కొనసాగుతున్నాయి.
ఒకరిద్దరు మినహా..
ఆస్పత్రిలో వైద్యులు పూర్తిస్థాయిలోఅందుబాటులో ఉండడం లేదు. ఆస్పత్రిలో హాజరు వేసిన వెంటనే బయట ఆస్పత్రిలో సేవలు అందించేందుకు వెళ్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి కారణంగా పనిచేస్తున్న వైద్యులు వీరి నుంచి మేము కూడా మాట పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎముకల వైద్యురాలి తీరే వేరు..
ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యురాలు తీరు వేరని రోగులు వాపోతున్నారు. ఆమె ఎప్పుడు విధులకు వస్తారో తెలియదు. వచ్చినా ఎంతసమయం ఉంటారన్నది స్పష్టత లేదు. ఇప్పటికే ఆమె తీరుపై పలు మార్లు ఫిర్యాదులు రావడంతో ఆమెను డీసీహెచ్‌ఎస్ మందలించిన సంఘటనలు ఉన్నాయి. ఆమె పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఆర్థోపెడిక్ విభాగంలో సాధారణ వైద్యులే రోగులకు సేవలు అందిస్తుంటారు.
పాలకొండ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల తీరుపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. మరి కొంతమందిని హెచ్చరించాం. ఇప్పటికీ వారి పనితీరు మారకపోతే చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. మరో మారు ఆస్పత్రిని సందర్శించి తగిన చర్యలు చేపడతాం.
–నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్
నర్సింగ్ విద్యార్థులే దిక్కు..!


