ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్ మార్పు
సీతంపేట: ఇకపై ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ప్రతి శుక్రవా రం నిర్వహించనున్నట్లు పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్పిల్ జగన్నాఽథ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని మార్పు చేసి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. యథావిధిగా అధికారులు శుక్రవారం హాజరు కావాలని స్పష్టం చేశారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చన్నారు.
పార్వతీపురంలో..
పార్వతీపురం: గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్‌డే నిర్వహించున్నా రు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిమిత్ర సమావే శ మందిరంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలనుంచి ప్రత్యేక గిరిజన గ్రీవెన్స్‌డేను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గిరిజనులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పార్వతీపురం రూరల్: జిల్లా ఉన్నతాధికారుల పేరుతోనే మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల తీరు మరోసారి కలకలం రేపింది. పార్వతీపు రం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి పేరుతోనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి, డబ్బులు వసూలు చేయాలని చూసిన ఘట న వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఫొటో, పేరుతో ఒక ఫేక్ అకౌంట్‌ను సృష్టించిన కేటుగాళ్లు, రవి అనే వ్యక్తికి సందేశాలు పంపారు. ‘ఓ ప్రాజెక్టు నిమిత్తం అత్యవసరంగా డబ్బులు కావాలి’ అని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందేశాల తీరుపై అనుమానం వచ్చిన రవి వెంటనే కలెక్ట ర్ కార్యాలయాన్ని సంప్రదించాడు. దీంతో అసలు విషయం తెలుసుకున్న కార్యాలయం అధి కారులు వెంటనే అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించారు. ఈ సైబర్ మోసంపై కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారికంగా పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్సై గోవింద తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని పి.ఆమిటి, డుమ్మంగి, బొద్దిడి గ్రామాల్లోని ద్రవ్య సహాయ క పాఠశాలలను జోన్ వన్ ఆర్‌జేడీ విజయ్ భాస్కర్ గురువారం పరిశీలించారు. ఈమేరకు ఆ పాఠశాలలను సంబంధిత యాజమాన్యాలు గతంలో ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం వల్ల ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు కాక మూతపడ్డాయి. అయితే ఆ గ్రామాల్లోని విద్యార్థుల చదువుకు ఆటంకం కాకుండా ఉండేందుకు గ్రామస్తుల విజ్ఞప్తుల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలను పునఃప్రారంభించినప్పటికీ.. అధికారికంగా ప్రభుత్వ పాఠశాలగా మారలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పాఠశాలలను సందర్శించిన ఆర్‌జేడీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేసేందుకు కావాల్సిన వసతులు ఉన్నాయో లేదో పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఆర్‌జేడీని కలిసిన ఆయా గ్రామస్తులు గ్రామాల్లోని బడిఈడు పిల్లలకు అన్యాయం జరగకుండా ఈ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలుగా మార్పు చేస్తూ కొనసాగించాలని కోరారు. ఆయన వెంట ఎంఈఓ బి.చంద్రశేఖర్ ఉన్నారు.
విజయనగరం ఫోర్ట్: మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్. జీవనరాణి సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షించారు. గర్భస్థ దశలో తీసుకోవాల్సిన చర్యలను గర్భిణులకు వివరించాలన్నారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


