తోటపల్లిపై తూటా..!
ప్రాధాన్యతా క్రమం నుంచి ప్రాజెక్ట్ తొలగింపు
రూ.195 కోట్లతో చేపట్టిన పాత పనుల రద్దు
రూ.292.5 కోట్లతో కొత్త ప్రతిపాదనలు
రూ.292.5 కోట్లతో కొత్త ప్రతిపాదనలు
వీరఘట్టం: అధికారంలోకి వస్తే తోటపల్లిని సస్యశ్యామలం చేస్తామని సెల్ఫీ చాలెంజ్‌లు చేసిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు తీరా అధి కారం చేపట్టిన తర్వాత తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులను ప్రాధాన్యతా ప్రా జెక్టుల నుంచి తప్పించారు. 25 శాతంలోపు ఉన్న ప్రాజెక్టు పనులను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. వారంరోజుల క్రితం తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులను పూర్తిగా రద్దు చేస్తూ గెజిట్ జారీ చేశారు. దీంతో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేద ని తేలిపోయింది. మళ్లీ రీ–ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేందుకు జలవనరులశాఖ అధికారులు కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మరో ఇరవైరోజుల్లో ముగియ నుంది. కావున జనవరి నెల నుంచి కాలువల పనులు చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉండనుండడంతో రూ.292.5 కోట్లతో తోటపల్లి పాత ఆయకట్టు కాలు వల ఆధునికీకరణ పనుల కోసం కొత్త ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ప్రతి పాదనలను కూటమి ప్రభుత్వం కరుణిస్తేనే తోటపల్లి పనులకు మోక్షం కలుగుతుంది. లేదంటే ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తోటపల్లి కా లువల ఆధునికీకరణ పనులు నిలిచిపోవాల్సిందే.
ఇదీ పరిస్థితి..
తోటపల్లి పాత ఆయకట్టులో సాగు విస్తీర్ణం 64 వేల ఎకరాలు. సాగునీరందించే 17.616 కి.మీ పొడవు న్న కుడికాలువలో 9.3 కి.మీ వరకు కాంక్రీట్ పనులు చేపట్టారు. అలాగే 37.536 కి.మీ పొడవున్న ఎడమకాలువలో 17.5 కి.మీ వరకు కాంక్రీట్, లైనింగ్ పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారు. సుమారు రూ.35 కోట్లతో చేపట్టిన ఈ పనులకు కాంట్రాక్టర్‌కు రూ.34 కోట్ల వరకు బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. అయితే ఆ పనులు 23.5 శాతం మాత్రమే జరగడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించి ఈ ప్రాంత రైతులకు వెన్నుపోటు పొడిచింది.
కూటమి కరుణిస్తుందా..?
ఈ ఏడాది తరచూ కురిసిన వర్షాలతో తోటపల్లి పాత ఆయకట్టు రైతులు ఖరీఫ్‌కు సాగునీటి కష్టాల నుంచి గట్టక్కారు. ఉభాల సమయంలో శివారు ఆయకట్టుకు నీరందడం లేదని పాలకొండ ప్రాంత రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతలో వర్షాలు కురవడంతో ఖరీఫ్ గట్టెక్కిందని రైతులు ఊరట చెందారు. ఈ పరిస్థితుల్లో రద్దయిన పనులకు కొత్తగా తెచ్చిన రూ.292.5 కోట్ల కొత్త అంచనా వ్యయానికి కూటమి కరుణిస్తుందా అంటూ రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం ఆమోదించి తోటపల్లి ఆధునికీకరణ పనులకు జీవం పోయాలని రైతులు కోరుతున్నారు.
రూ.97.5కోట్లు పెరిగిన అంచనా వ్యయం..
గతంలో తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులకు రూ.195 కోట్లు సరిపోతాయని జలవనరులశాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో అధికారులు రీ–ఎస్టిమేషన్ వేస్తున్నారు. పెరిగిన చార్జీలను కలుపుకుని గత ఎస్టిమేషన్‌కు 50 శాతం పెంచుతూ రూ.292.5 కోట్లతో నూ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు జలవనరులశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
గతంలో చేపట్టిన పనులు 25 శాతం లోపు ఉండడంతో ఈ పనులను ప్రభుత్వం రద్దు చేసింది.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెరిగిన ధరల ప్రకారం 50 శాతం అంచనా వ్యయం పెరిగింది. దీంతో రూ.292.5 కోట్లతో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిస్తాం.
డీవీ రమణ, జలవనరులశాఖ ఏఈ, వీరఘట్టం
తోటపల్లిపై తూటా..!


