సిరిధాన్యాలపై దృష్టి పెట్టండి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతిరైతు వ్యాపారవేత్తగా ఎదగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతను, ఆధునిక యంత్రాలను అందిపుచ్చుకునేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 6వేల ఎకరాల్లోని చిరుధాన్యాల సాగు లక్ష్యం మరింత పెరగాలని, లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యక్తిగత పెట్టుబడి పెట్టలేని రైతులు బృందాలుగా ఏర్పడి సాంకేతికతను వినియోగించుకునేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రస్తు తం ఎనిమిదిగా ఉన్న డ్రోన్ల వినియోగాన్ని గణణీయంగా పెంచాలన్నారు. ఖాళీ ప్రభుత్వ భూముల్లో ఉద్యాన పంటలు వేసి ఆదాయం సృషించాలని చెప్పారు.
స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి కావాలి
అలాగే జిల్లాలో 2.73లక్షల స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ నాలుగురోజుల్లో పూర్తి కావా లని డీఎస్‌ఓను ఆదేశించారు. ముఖ్యంగా వలస వెళ్లిన వారి వివరాలను సేకరించి వారికి కార్డులు అందేలా చూడాలన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అంబులెన్స్‌లు వెళ్లేలా గుర్తించిన 83 రహదారి పనులకు వెంటనే టెండరు ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించాలని ఆదేశించా రు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, హెల్త్ రికా ర్డుల నిర్వహణ పక్కాగా జరగాలని, బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకో వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పార్వతీపురం రూరల్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా పార్వతీ పురం సబ్‌డివిజన్‌కు ఏఎస్పీగా(ఎస్‌బీపీఓ) మనీషా వంగలరెడ్డిని కేటాయించడంతో గురువారం ఆమె పార్వతీపురంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలపట్ల ఎస్పీ ఆమెకు దిశానిర్దేశం చేశారు.


