మురిపిస్తున్న మన్యం అందాలు
● ఆకర్షిస్తున్న ప్రకృతి సోయగాలు
● సవ్వడి చేస్తున్న జలపాతాలు
● కార్తీక మాసంలో సందర్శకుల తాకిడి
సీతంపేటలోని అడ్వెంచర్ పార్కు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. హాట్ ఎయిర్ బెలూన్.. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యం. పర్యాటకులు 300 అడుగుల ఎత్తు నుంచి మన్యం పచ్చని అందాలను తిలకించే అద్భుత అవకాశం ఉంది. ఇది సాహస క్రీడలను కోరుకునేవారికి స్వర్గధామంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అడలి వ్యూ పాయింట్.. సందర్శకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడి నుంచి వంశధార రిజర్వాయర్ విహంగ వీక్షణం అందుబాటులోకి వచ్చింది. మెట్టుగూడ జలపాతం వద్ద పిల్లల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి, సరికొత్త ఆకర్షణగా తీర్చిదిద్దారు. తోటపల్లి వద్ద ఐటీడీఏ పార్కు, గుమ్మలక్ష్మీపురంలోని సవరపాడు సాహస ఉద్యాన కేంద్రం.. ఈ కార్తీక మాసంలో మంచి పిక్నిక్ స్పాట్లుగా గుర్తింపు పొందాయి. వీటిని మరింత అభివృద్ధి చేస్తే స్థానికంగానూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
మురిపిస్తున్న మన్యం అందాలు
మురిపిస్తున్న మన్యం అందాలు


