ఐక్యత మార్చ్ పోస్టర్ల ఆవిష్కరణ
పార్వతీపురం రూరల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మై భారత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ‘సర్దార్ ఎట్‌ద రేటాఫ్ 150 ఐక్యతా మార్చ్’ ప్రచార పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తన చాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత కోసం చేసిన కృషిని కొనియాడారు. ఉక్కుమనిషిగా పేరుగాంచిన పటేల్ దూరదృష్టి, నాయకత్వ పటిమ వల్లే దేశం ఏకమైందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత పాల్గొన్నారు.
పిట్టలమెట్టలో ఏనుగుల గుంపు
గరుగుబిల్లి: మండలంలోని నందివానివలస, సంతోషపురం, పిట్టలమెట్ట, తోటపల్లి, నాగూరు గ్రామాల్లో గత నాలుగు రోజుల నుంచి ఏనుగులు సంచరిస్తున్నాయి. మంగళవారం పిట్టల మెట్టకు చేరుకున్నాయి. ప్రస్తుతం వరి, అరటి, పామాయిల్ తదితర పంటలు సాగులో ఉన్నాయి. పంట కోత దశలో ఏనుగులు పొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బంది స్పందించి ఏనుగుల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యువతపైనే భవిత
పార్వతీపురం: యువతపైనే దశ భవిత ఆధారపడి ఉందని, నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు కేంద్రప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఎమ్మెల్యే బి. విజయచంద్ర, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె. హేమలత, ప్రిన్సి పాల్ టీవీ శైలజారాణి, డీవీఈఓ వై.నాగేశ్వరరావు, జిల్లా యువజనోత్సవ అధికారి ప్రేమ్ భరత్, తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర విమాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు మంగళవారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 27 శాతం మేర నిర్మాణ పనులు పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం 91.7 శాతం పనులు పూర్తయ్యాయని, జనవరిలో ఇక్కడ నుంచి విమానరాకపోకలను పరీక్షిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ 20వ తేదీ నాటికి నిర్మాణ పనులను పూర్తిచేయాలని సీఎం సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఐదు స్టార్ హోటల్స్‌తో పాటు ఇండిగో హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నామని, ప్రపంచాన్ని జయించే శక్తి ఉంత్తరాంధ్రలో ఉందని తెలిపారు. కార్యక్రమంలోఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి, ఏస్పీ దామోదర్, ఆర్డీఓ దాట్ల కీర్తి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఐక్యత మార్చ్ పోస్టర్ల ఆవిష్కరణ
ఐక్యత మార్చ్ పోస్టర్ల ఆవిష్కరణ


