బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
మెట్ట్టుగూడజలపాతం
చుట్టూ ఎత్తైన కొండలు.. ఒంపులు తిరిగే నదులు.. హొయలొలికించే జలపాతాల సవ్వడులు.. పచ్చని పైర్లు.. దట్టమైన అడవి చెట్ల ముచ్చట్లు.. అచ్చ పల్లె సంప్రదాయాలు.. కల్మషం ఎరుగని గిరి బిడ్డల నవ్వులు. మన మన్యాన్ని చూస్తే.. అందాన్నంతా తన కొప్పులో పూల మాదిరి తురుముకుందా అనిపించక మానదు. పర్యాటకంగా ఎన్నో అవకాశాలు జిల్లాకు సొంతం. పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. వాటికి మరింత మెరుగులు అద్ది.. ఆధ్యాత్మికత, చరిత్రను జోడిస్తూ.. మన్యం సంస్కృతిని ప్రపంచానికి చాటాలన్న కృత నిశ్చయంతో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025


