ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
పార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల వద్ద ఉన్న ప్రసిద్ధ శివాలయం కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయాన్ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సోమవారం సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. జన సమూహం ఉన్న దేవాలయాలు, మతపరమైన సభలు, సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తోపులాటలు జరగకుండా చూడాలన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఆయన వెంట జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్వో కె. హేమల త, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి. తహసీల్దార్ సురేష్, ఎస్‌ఐ బి.సంతోషికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: విద్యార్థి సంఘాల పోరాటం ఫలించింది. డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాచ్‌మన్ గౌరీశంకర్‌ను మామిడి ఆశ్రమ పాఠశాలకు డిప్యుటేషన్ వేస్తూ జేసీ, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. గౌరీ శంకర్ ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం, రాజకీయ అండదండలతో అధికారులనే బ్లాక్‌మెయిల్ చేయడం, విధులు విస్మరించి ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం, పాఠశాల సామగ్రి, కంప్యూటర్లు, ట్యాబ్‌లను దొంగిలించడం వంటి పనులపై గిరిజన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాయి. సమాచారం అందుకున్న జేసీ వాచ్‌మన్ తీరుపై విచారణ జరిపించారు. వాస్తవాలు వెలుగు చూడడంతో డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్టు సమాచారం.
పార్వతీపురం రూరల్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులకు స్పష్టత ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ అర్జీలను చట్టాలకు లోబడి పరిష్కరించాలని, ప్రతి అర్జీని సింగిల్ పేజీ నోట్ రూపంలో ముగించాలని అధికారులకు సూచించారు. సమస్యను పరిష్కరించాక అర్జీదారుడి సంతృప్తిని రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి వనరులు, చెరువులు ఆక్రమణకు గురైనట్లు తేలితే సంబంధిత శాఖ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలకు సిఫార్సు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో హేమలత, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, ఉప కలెక్టర్లు, డీఆర్‌డీఏ పీడీ, పలు మండలాల తహసీల్దార్లు, ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కురుపాం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షే మ బాలికల గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాలను విజయనగరం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, స్థానిక జ్యుడీషిల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సౌమ్య జోస్ఫిన్ సోమవారం సందర్శించారు. గిరిజన విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రా ధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరి, ఎస్‌ఐ నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.
మడ్డువలసకు తగ్గిన వరద
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి తగ్గింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు వద్ద వరద శాంతించింది. సోమవారం ప్రాజెక్టు వద్ద 64.16 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన


