
పాలనలో కూటమి విఫలం
కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషచయాన్ని ప్రజలు గుర్తించారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాచేయలేక చేతులెత్తేసింది. విద్యార్థులు, నిరుద్యోగులను అబద్ధపు హామీలతో కూటమి నేతలు నిలువునా ముంచేశారు. ఇప్పుడు నిజం మాట్లాడితే కేసులు పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ఎస్సీ,ఎస్టీ దళిత సామాజిక వర్గాలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ఎస్సీ అనుబంధ విభాగాల నాయకులపై ఉంది. – పీడిక రాజన్న దొర,
మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు