
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల విశాఖలోని రైల్వే స్టేడియంలో జరిగిన 6వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాల, బాలికల పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు 8 పతకాలు కై వసం చేసుకున్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం దక్కించుకున్న బి. సచిన్ వచ్చేనెల 7 నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అదేవిధంగా పోటీల్లో ఎన్.దేవకి, వి.జాహ్నవిలు వెండి పతకాలు దక్కించుకోగా..పి.లోకేష్, పి.దుర్గాప్రసాద్, వర్ధన్, ఆర్.యశ్వంత్, బి.గౌతమ్ గణేష్‌లు కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, కార్యదర్శి ఇందుకూరి అశోక్‌రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్‌ఈ.రాజు, శాప్ కోచ్ బి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయపోటీలకు ఎంపికై న సచిన్