
లెక్కల్లోనే పింఛన్..!
మంజూరైన
స్పౌజ్ పింఛన్లు
1,634
అందజేసిన
నగదు
0
● చేతికి అందని పింఛన్ డబ్బులు
● ప్రతినెలా ‘స్పౌజ్’ లబ్ధిదారులకు నిరాశే..
● నెలలు గడుస్తున్నా అందని నగదు
పార్వతీపురం మండలం బుచ్చింపేటకు చెందిన ఈ మహిళ పేరు దొడ్డి నారాయణమ్మ. స్పౌజ్ కింద రెండు నెలలుగా పింఛన్ మంజూరైందని అధికారులు చెబుతున్నారు. ఒకటో తేదీకి ఇస్తామని చెబుతున్నారు గానీ.. తీరా, తేదీ వచ్చేసరికి డబ్బులు మాత్రం రాలేదని అంటున్నారు. ఇంకే ఆధారమూ లేక, ప్రతి నెలా పింఛన్ మొత్తం కోసం ఆమె ఆశగా ఎదురు చూస్తోంది.
–––––––––––––––––––––––––––
పార్వతీపురం మండలం డోకిశీల సచివాలయం పరిధిలోని ఈ వృద్ధురాలి పేరు పెద్దపల్లి గౌరమ్మ. ఈవిడ భర్త పెద్దపల్లి వెంకటి సుమారు 13 నెలల కిందట మృతి చెందారు. ఏ ఆధారమూ లేని ఆమె పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారుల వద్ద పలుమార్లు మొర పెట్టుకుంది. ప్రతినెలా పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన అధికారులు.. ఆమె పేరు లబ్ధిదారు జాబితాలో ఉందనీ చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని, అందుకే ఇవ్వలేకపోతున్నామని చెప్పడంతో ఆమె నిరాశకు గురవుతోంది.
కూటమి నేతల ప్రకటనలకు... ఆచరణకు పొంతనలేకపోతోంది. కేబినెట్ సమావేశాల్లో ఆమోదించిన పనులు, పథకాలు కూడా అమలుకాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. పింఛన్ జాబితాల్లో వారి పేర్లు కూడా చేరాయి. కానీ పింఛన్ డబ్బులు మాత్రం చేతికి అందడం లేదు. ఎప్పుడిస్తారన్న లబ్ధిదారుల ప్రశ్నకు సమాధానం కరువవుతోంది. భర్తను కోల్పోయిన వితంతువులు ప్రతినెలా పింఛన్ ఇస్తారని ఆశగా చూడడం, ఉసూరుమనడం వారి వంతువుతోంది.

లెక్కల్లోనే పింఛన్..!

లెక్కల్లోనే పింఛన్..!