
సీజీఆర్‌ఎఫ్‌కు 43 వినతులు
వీరఘట్టం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం చైర్మన్ డాక్టర్ బి.సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు గురువారం వీరఘట్టం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కారించాలంటూ వినియోగదారులు 43 వినతులు అందజేశారు.
● హుస్సేనుపురం, మొట్టవెంకటా పురం, కిమ్మి గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య వేధిస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు.
● చిదిమిలో పాత విద్యుత్ స్తంభాలను మార్చాలని, ఇదే ఫీడర్‌లో ఏబీ స్విచ్‌లు లేక విద్యుత్ అంతరాయం ఎక్కువ అవుతోందని, వైర్లు పాతబడిపోవడంతో తరుచూ తెగిపోతున్నాయని ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు ఫిర్యాదు చేశారు.
60 రోజుల్లో పరిష్కారం..
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను 60 రోజుల్లో పరిష్కరిస్తామని చైర్మన్ బి.సత్యనారాయణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక ఆర్థిక వ్యవహారాల సభ్యుడు ఎస్.సుబ్బారావు, సాంకేతిక నిపుణులు ఎస్.రాజబాబు, ఎన్.మురళీకృష్ణతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ కె.మల్లికార్జునరావు, ఈఈ టెక్నికల్ డి.పురుషోత్తం, పాలకొండ డీఈ కె.విష్ణుమూర్తి, ఎ.డి మోహనచక్రవర్తి, వీరఘట్టం ఏఈ కె.అనిల్‌కుమార్‌తో పాటు సర్కిల్ పరిధిలో ఉన్న ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వినతులకు 60 రోజుల్లో పరిష్కారం
సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్
చైర్మన్ డాక్టర్ బి.సత్యనారాయణ

సీజీఆర్‌ఎఫ్‌కు 43 వినతులు