విజయనగరం: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో గత నెలలో అహమ్మదాబాద్‌లో నిర్వహించిన బీసీసీఐ అంపైర్ల పరీక్షల్లో విజయనగరానికి చెందిన తోట విజయ్ ఉత్తీర్ణత సాధించారు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అంపైర్ల పరీక్షల్లో జిల్లా చరిత్రలో తోట విజయ్ అంపైర్ సర్టిఫికేషన్ పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు సాధించారు. అంతేకాకుండా, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అర్హత పొందిన ఏకై క అభ్యర్థి కూడా ఆయనే. ఆయన సాధించిన విజయం విజయనగరం క్రికెట్‌కు గర్వకారణమే కాకుండా భవిష్యత్ అంపైర్లకు ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పటికే విజయ్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్కోరర్‌గా వ్యవహరిస్తున్నారు. తోట విజయ్ బీసీసీఐ అంపైర్ల పరీక్ష ఉత్తీర్ణత కావడంతో ఇకనుంచి దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్, అంతర్‌రాష్ట్ర క్రికెట్ మ్యాచ్‌లకు ఎంపైరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా విజయ్‌కు జిల్లా క్రికెట్ అసోసియేషన్, నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ ప్రతినిధులు, పలువురు కోచ్‌లు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
పీఎం జుగా నిధులతో పాఠశాలలకు భవనాల నిర్మాణం
పార్వతీపురం/మక్కువ: పీఎం జుగా, పీఎం జన్‌మన్ నిధులు మంజూరైన వెంటనే పాఠశాలలకు భవనాలను నిర్మిస్తామని గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్.కృష్ణవేణి తెలిపారు. ఈ మేరకు గురువారం (జూలై 3న) ‘‘సాక్షి’’ దినపత్రికలో ‘‘గిరిజన బిడ్డల చదువుల కష్టాలు’’ శీర్షికన ప్రచురితమైన కథనం పట్ల ఆమె స్పందిస్తూ మక్కువ మండలంలోని ఎర్ర సామంతులవలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గిరిజన ప్రాథమిక పాఠశాల చిలకమెండంగిలో 8మంది విద్యార్థులు చదువుతున్నారని, రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 8 మండలాల్లో 352 పాఠశాలలు ఉన్నాయని, వాటిలో 58గిరిజన ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేనందున పీఎం జుగా, పీఎం జన్‌మన్ కింద పాఠశాలల భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆమె స్పష్టం చేశారు.
వర్షాలకు కూలిన పెంకుటిళ్లు
జామి: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలకేంద్రం జామి లో రెండు పెంకుటిళ్లు గురువారం కూలిపోయాయి. గ్రామానికి చెందిన రాజాన సీతారాం, సీరెడ్డి సింహాచలంల పెంకుటిళ్లు వర్షాలకు నానడంతో కూలిపోయాయని గ్రామస్తులు, బాధితులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
తైక్వాండో విజేతలకు సత్కారం
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గురువారం సత్కరించారు. అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్తరఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జూన్ 23 నుంచి 25 వరకు జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో అండర్ 25 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షణ్ముఖ్ సిద్ధార్థ నాయుడు, అండర్ 48 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన బుగత హర్షవర్ధన్, మహిళల విభాగంలో అండర్ 32 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఇజ్జాడ వైష్ణవిదేవిలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
నిషేధిత పాలిథిన్ కవర్లు వాడొద్దు
బీసీసీఐ అంపైర్ పరీక్షల్లో తోట విజయ్ ఉత్తీర్ణత
బీసీసీఐ అంపైర్ పరీక్షల్లో తోట విజయ్ ఉత్తీర్ణత