యాప్‌లతో దారుణం | Sakshi
Sakshi News home page

యాప్‌లతో దారుణం

Published Mon, Nov 20 2023 12:36 AM

లోన్‌యాప్‌ల నెట్‌ఫొటోలు - Sakshi

పార్వతీపురంటౌన్‌: సాంకేతిక విప్లవం కొన్ని సందర్భాల్లో దారి తప్పుతోంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మొబైల్‌ టెక్నాలజీ అదే చేత్తో ప్రజల ప్రాణాలను కూడా బలితీసుకుంటోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లోన్‌ యాప్‌ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారి వలలో పడి రుణాలు తీసుకున్న అమాయకులు. తిరిగి చెల్లించలేనప్పుడు వారి వేధింపులు తాళలేక తనువు చాలిస్తున్నారు. ఇటువంటి సంఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. నిర్వాహకుల వేధింపులు, పరువు, ప్రతిష్టలు రోడ్డున పడతాయనే భయంతో ఆందోళనలో ఏం చేయాలో తెలియక ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు.

’ఈజీ రుణంతో వల

● లోన్‌ యాప్‌లో రుణం కోసం ఎటువంటి హామీ అవసరం లేదు.

● మొబైల్‌ ఉండి, లోన్‌ యాప్‌ డౌఏన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది.

● హామీ లేకుండా రూ.2,000 నుంచి రూ.50 వేల వరకూ యాప్‌లో లోన్‌ ఇస్తుంటారు.

● రుణం చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా లోన్‌ యాప్‌ నిర్వాహకులు ఉపేక్షించరు.

● లోన్‌ యాప్‌ డౌనః్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా మొబైలోని వ్యక్తిగత డేటా (సమగ్ర సమాచారం) నిర్వాహకుల గుప్పిట్లోకి వెళ్లిపోతుంది.

’హామీ లేకుండా రుణాలతో వల

మీ మొబైల్‌ ఫోన్‌లో ఒకే ఒక క్లిక్‌తో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ‘హామీ లేకుండానే రుణం పొందండి’ అంటూ లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు ఇచ్చే ప్రకటనలు ఇవి. హామీ అవసరమే లేదనడంతో పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆకర్షితులై తమ మొబైల్‌ లో యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. వివరాలు ఇవ్వడమే ఆలస్యం. క్షణాల్లో రూ.50 వేల లోపు రుణం ఖాతాలో జమైపోతుంది. రుణం ఇచ్చేటప్పుడు హుందాగా వ్యవహరించే నిర్వాహకులు చెల్లించడం ఒక్కరోజు ఆలస్యమైనా బెదిరింపులు, వేధింపులకు దిగుతున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడే మొబైలోని కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోలు, వీడియోలు సహా అన్నింటికీ యాప్‌ నిర్వాహకులకు యాక్సెస్‌ ఇవ్వాలి. లేదంటే రుణం రాదంటారు. యాక్సెస్‌ ఇవ్వగానే రుణం తీసుకున్న వారి రుణ యాప్‌ సర్వర్లకు అనుసంధానమవుతుంది. అవసరార్థం అప్పు ఇస్తే చాలనుకునే సందర్భంలో షరతులు, నిబంధనలను చూసుకోకుండానే చాలామంది అంగీకరిస్తున్నారు. అదే వారి పాలిట యమపాశమవుతోంది.

అపరిచిత యాప్‌లపై

అప్రమత్తం

చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో మనకు తెలియని అపరిచిత యాప్‌ కనిపిస్తే అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి యాప్‌ను ఆయాచితంగా క్లిక్‌చేసే అలవాటుతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అడ్డుగోలుగా లోన్‌ యాప్‌లోకి వెళ్తే మీ వ్యక్తిగత సమాచారం వారి గుప్పెట్లోకి వెళ్తోంది. మోసపూరితంగా ఉంటున్న లోన్‌యాప్‌ల జోలికి దయచేసి వెళ్లొద్దు. నిర్వాహకులు వేధిస్తుంటే తక్షణమే సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా సంబంధిత బ్యాంకు అధికారులను కూడా సంప్రదించాలి.

– జి మురళీధర్‌, డీఎస్పీ, పార్వతీపురం

మోసపోతున్న యువత

1/2

2/2

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement