23 | Sakshi
Sakshi News home page

23

Published Mon, Nov 20 2023 12:36 AM

అమ్మవారి జాతర తేదీలను ప్రకటిస్తున్న దేవదాయ శాఖ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు    - Sakshi

జనవరి

పోలమాంబ సిరిమాను సంబరం

మక్కువ: ఉత్తరాంఽద్ర ప్రజల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలను దేవదాయ శాఖ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ఆదివారం ప్రకటించారు. ఆలయ ఈఓ వి.వి.సూర్యనారాయణ, ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పూడి దాలినాయు డు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చదురుగుడిలో సమావేశమై శంబర పోలమాంబ అమ్మ వారి జాతర తేదీలను నిర్ణయించారు. డిసెంబర్‌ 18వ తేదీ నుంచి పోలమాంబ అమ్మవారి జాతర ఉత్సవం ప్రారంభం కానుంది.

● డిసెంబర్‌ 18న పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు సనప సాటింపు వేస్తారు.

● డిసెంబర్‌ 25న గ్రామంలోకి పెదపోలమాంబ అమ్మవారిని తీసుకువస్తారు.

● జనవరి 1న పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం.

● జనవరి 2న ప్రధాన పండగ

● జనవరి 3న అనుపోత్సవం. అదే రోజు శంబర పోలమాంబ అమ్మవారిని కొని తెచ్చేందుకు సనప సాటింపు వేస్తారు.

● జనవరి 8న గ్రామంలోకి శంబర పోలమాంబను తీసుకువస్తారు.

● జనవరి 9న అమ్మవారు చదురుగుడిలో విశ్రాంతి తీసుకుంటారు.

● జనవరి 10 నుంచి గ్రామంలోని చదురుగుడిలో అమ్మవారు కొలువై ఉండి, 12 రోజుల పాటు గ్రామంలో తిరువీధి కార్యక్రమం నిర్వహిస్తారు.

● జనవరి 22న తొలేళ్ల ఉత్సవం.

● జనవరి 23న సిరిమానోత్సవం.

● జనవరి 24న అనుపోత్సవం.

● జనవరి 30న మారుజాతర నిర్వహిస్తారు.

● ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో మూడు, నాలుగు, అయిదు, ఆరవ జాతర నిర్వహిస్తారు.

● మార్చి 3, 12, 19, 26 తేదీల్లో ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదవ జాతరలు నిర్వహిస్తారు.

● మార్చి 26వ తేదీన చండీహోమం, మహా అన్నదానం కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవదాయ శాఖ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, గ్రామపెద్దలు నిర్ణయించారు.

అమ్మవారి జాతర తేదీలు ఖరారు చేసిన దేవదాయ శాఖ

1/1

Advertisement
 
Advertisement