బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి | Sakshi
Sakshi News home page

బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి

Published Sun, Nov 19 2023 12:52 AM

వీరఘట్టం ఎంఈఓ ఆనందరావుతో మాట్లాడుతున్న ప్రత్యామ్నాయ పాఠశాలల కో–ఆర్డినేటర్లు - Sakshi

వీరఘట్టం: చైల్డ్‌ ఇన్‌ఫో ప్రకారం బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల కో–ఆర్డినేటర్‌ ఎన్‌.మధుకిశోర్‌ అన్నారు. వీరఘట్టం మండల విద్యాశాఖ కార్యాలయానికి విచ్చేసిన ఆయన విలేకర్లతో శనివారం మాట్లాడారు. ఈ ఏడాది జూలై నాటికి జిల్లా వ్యాప్తంగా 12 వేల మంది బడి బయట ఉండేవారని, ఇప్పుడా సంఖ్య 3,750కు తగ్గిందన్నారు. కొంతమంది పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తయిన వారు బయట ఊళ్లలో ఉంటున్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రతి విద్యార్థి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. వీరఘట్టం మండలంలో డ్రాపౌట్స్‌పై ఎంఈఓ ఆర్‌.ఆనందరావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మరో కో–ఆర్డినేటర్‌ బి.అప్పలనాయుడు ఉన్నారు.

జిల్లాలో 3,750 మంది పిల్లలు బడిబయట ఉన్నారు

ప్రత్యామ్నాయ పాఠశాలల జిల్లా కో–ఆర్డినేటర్‌ మధుకిశోర్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement