సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

Published Wed, Nov 8 2023 1:46 AM

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి 
క్షీరాభిషేకం చేస్తున్న జర్నలిస్టులు - Sakshi

భోగాపురం: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయమై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి భోగాపురం మండల కార్యాలయం కూడలిలో మంగళవారం క్షీరాభిషేకం చేశారు. గతంలో ఎన్ని ప్రభుత్వం వచ్చినా.. జర్నలిస్టుల కలలు నెరవేరలేదని, గత ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా మాట నెరవేర్చిన జగనన్నకు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. సీఎం మేలు మరచిపోమని తెలిపారు. కార్యక్రమంలో ప్రింట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు చందక లక్ష్మినాయుడు, కలిశెట్టి బాబూరావు, పల్లె శ్రీనివాసరావు, సురేష్‌, ఆళ్ల వెంకటేష్‌, పద్మరాజు శంకర్‌, కుశరాజు, రవితేజ, శంకర్‌, పి.గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement