బాబు కుట్రలపై సంతకాల ఉద్యమం
పేదలంటే చంద్రబాబుకు ఎంత కపట ప్రేమో వైద్య కళాశాలల ప్రయివేటీకరణతో మరోమారు నిరూపితమైంది. వైద్య విద్యను, వైద్య సేవలను దూరం చేసే ప్రభుత్వ కుట్రలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
● వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు
చంద్రబాబు ప్రభుత్వం చర్యలు
● పేద, మధ్యతరగతి వారికి వైద్యం,
వైద్య విద్య ఇంకా దూరం
● సర్కారు తీరుకు నిరసనగా
వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ
● విద్యార్థులు, తల్లిదండ్రులు,
ప్రజాసంఘాలు, మేధావుల మద్దతు
● జిల్లా వ్యాప్తంగా 3.77 లక్షలకుపైగా
సంతకాల సేకరణ పూర్తి
సాక్షి, నరసరావుపేట: పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు వైద్య విద్య చదవాలని, పేదలతోపాటు మధ్య తరగతి వారికి వైద్య సేవలు మరింత చేరువ కావాలని వైఎస్సార్‌సీపీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రయత్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చేది. అయితే వారి పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను చంద్రబాబునాయుడు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ విద్యను అభ్యసించాలనుకునే నీట్ విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో ప్రయివేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తోంది. దీనిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఊరూరా రచ్చబండ నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో నష్టాలను వివరిస్తున్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేఽత్తలు, ప్రజాసంఘాల వారు పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని నియోజకవర్గాలలో అనుకున్న లక్ష్యాలకు మించి స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి సంతకాలు చేస్తుండటం గమనార్హం. నియోజకవర్గాల వారీగా మాచర్లలో 66 వేలు, గురజాల – 40 వేలు, సత్తెనపల్లి– 66 వేలు, పెదకూరపాడు– 49,600, నరసరావుపేట – 52 వేలు, చిలకలూరిపేట–52 వేలు, వినుకొండలో 52 వేల సంతకాలు సేకరించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 నూతన మెడికల్ కళాశాలలను ప్రవేశపెట్టారు. ఇందులో ఐదు వైద్య కళాశాలలు 2023–24లో ప్రారంభించి వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వరంగా మార్చారు. వైద్య విద్యతో పాటు నర్సింగ్ లాంటి అనుబంధ కళాశాలలు అందుబాటులోకి వస్తాయి. చంద్రబాబు సర్కారు కొలువుదీరాక వైద్యరంగం నిర్వీర్యమైంది. పేద విద్యార్థుల డాక్టర్ కల చిదిమేసేలా నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మారిపోతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం లభిస్తోంది.
ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్‌పరం చేయడం వల్ల జరిగే అనర్థాలను ఉదాహరణలతో సైతం గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు. గతంలో జరిగిన వాటితో పోల్చితే కోటి సంతకాల ఉద్యమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద కుటుంబాలు మద్దతు తెలుపుతున్నాయి. జిల్లాలోని వినుకొండ, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ఇప్పటికే 3.77 లక్షలకుపైగా సంతకాలు పూర్తి అయ్యాయి.
బాబు కుట్రలపై సంతకాల ఉద్యమం
బాబు కుట్రలపై సంతకాల ఉద్యమం


