అక్కడ తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలి
పట్టణంలోని పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలి. దీనికి అనుబంధంగా బ్లడ్‌బ్యాంకు, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిల పక్ష కమిటీగా ఏర్పడి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాం. ఇప్పటికే సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, ఎంపీ, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశాం. ఇక్కడ యూపీహెచ్‌సీ బదులు తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలి.
– నాయుడు శివకుమార్, ఆసుపత్రి సాధన కమిటీ కార్యదర్శి


