‘సంతకమే’ సమర శంఖం
ఉద్యమంలా వైఎస్సార్ సీపీ
కోటి సంతకాల సేకరణ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత
ప్రజల భాగస్వామ్యంతో ముమ్మరంగా కార్యక్రమం
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి
సత్తెనపల్లి నియోజకవర్గంలో
66 వేలకుపైగా సంతకాల సేకరణ
సత్తెనపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రజలు, విద్యార్థుల భాగస్వామ్యంతో వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నేతృత్వంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని పట్టణంతో పాటు అన్ని మండలాల్లో సంతకాల సేకరణ ఉప్పెనలా సాగుతోంది. పార్టీ శ్రేణులు గ్రామ, గ్రామాల్లో పర్యటి స్తుండగా ప్రజలు మమేకమవుతున్నారు. కూటమి ప్రభుత్వం వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్న వైనాన్ని నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ప్రత్యేకించి యువత చైతన్యవంతులై సంతకాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఊరు వాడా ఊపందుకుంది.
స్వచ్ఛందంగా సంతకాలు
పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లిరూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందం సంతకాల సేకరణ చురుగ్గా చేస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 66 వేలకు పైగా సంతకాల సేకరణ జరిగింది. ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పేద, మధ్యత రగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యమంలో సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారు.
ఆవిరైపోతున్న ఆశలు
ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో తమ ఆశలు ఆవిరైపోతున్నాయని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేద విద్యార్థుల ఆవేదన, ప్రజల ఆశల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విద్యావేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు.
ఆధ్వర్యంలో నిర్వహణ


