భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలి
పమిడిమర్రులోని దళితుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకు లు డిమాండ్ చేశారు. సోమవారం వారు పమిడిమ ర్రులో ఆక్రమణకు గురవుతున్న అసైన్డ్ భూములను పరిశీలించారు. 16 ఏళ్ల కిందట 100 మంది దళితు లకు భూములను కేటాయించి బీ ఫారాలు ఇచ్చార ని తెలిపారు. వారి ప్లాట్లు చూపకపోవడంతో భూ ములను చేపల చెరువుగా మార్చి వచ్చిన ఆదాయం ఉమ్మడిగా అనుభవిస్తున్నారని తెలిపారు. కోటప్పకొండకు, జేఎన్‌టీయూఎన్‌కు కూతవేటు దూరంలో ఉన్న భూములకు ధరలు రావడంతో వీటిని ఆక్ర మించేందుకు పలుమార్లు ప్రయత్నించారని తెలిపా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫి యా ఈ భూములపై కన్నెసినట్టు పేర్కొన్నారు. భూ మాఫి యాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, వై.వెంకటేశ్వరరావు,జి.రామకృష్ణ, ప్రసాద్ ఉన్నారు.
ప్రజాసంఘాల నాయకులు


