సర్టిఫికెట్ కోసం ఎన్నాళ్లు తిరగాలి?
రామిరెడ్డిపేటలో నాకు సొంత ఇల్లు ఉంది. అందులో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్నా. నా ఇల్లు శారదా ఇంటితో కలిసి జాయింట్ శ్లాబు ఉంది. ఇద్దరికి కలిపి వాటర్ ట్యాంకు నిర్మాణం చేశారు. ఆ ట్యాంకు నుంచి నీరు లీకై శ్లాబ్ తడుస్తూ ఇల్లు అంతా డ్యామేజ్ అయింది. విద్యుత్ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయి. 2023లో స్పందనలో ఫిర్యాదుచేస్తే మున్సిపాల్టీకి అప్పచెప్పారు. కమిషనర్ ఆదేశాలతో టీపీఓ, టీపీఎస్, టౌన్ సర్వేయర్ వచ్చి చూసి వాటర్ లీకేజ్ పరిశీలించి ఇంటి పక్కనున్న వారిని మరమ్మతు చేయించాలని చెప్పారు. వారు తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. అయినా సమస్య తీరలేదు. ఇంటిపక్కనున్న వారిని ట్యాంకు తొలగించాలని కోరినా వారు వినట్లేదు. ఆ ట్యాంకు తొలగించి డ్యామేజ్ రిపోర్టు ఇప్పించండి. శ్లాబ్ మరమ్మతు చేయించుకుంటాం.
–నంద్యాల అనసూర్య, రామిరెడ్డిపేట, నరసరావుపేట


