
ప్రభాకర్‌ను వెంటనే విడుదల చేయాలి
నరసరావుపేట: కుల నిర్మూలనా పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌తోపాటు దేశవ్యాప్తంగా అనేక అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆదివాసీలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని కేఎన్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక ఉపా చట్టం కింద ప్రభాకర్‌ను అరెస్టు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ కేఎన్‌పీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న ఒంగోలు పట్టణంలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదుట సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేఎన్‌పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్నప్రసాదు, సహాయ కార్యదర్శి జక్కాబ్రహ్మయ్య, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఓర్సు శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు బయ్యవరపు రామయ్య, ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యులు చలంచర్ల అంజి, కంబాల ఏడుకొండలు, దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ పాల్గొన్నారు.