
కార్మికుల సమ్మెతో కేంద్రం దిగి రావాలి
నరసరావుపేట: కార్మికుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి లేబర్ కోడ్ అమలు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు కోరారు. బుధవారం సార్వత్రిక సమ్మెలో భాగంగా వినుకొండ రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద నుంచి స్టేషన్‌రోడ్డులోని గాంధీ పార్కు వద్ద ధర్నా శిబిరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె శిబిరానికి సీఐటీయూ నాయకులు షేక్ సిలార్ మసూద్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ మాట్లాడుతూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాల్ని ప్రధాని విడనాడాలని కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆఫీసు నుంచి ఆర్డీవో కార్యాలయం, గాంధీ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలో సార్వత్రిక సమ్మె
ర్యాలీ నిర్వహించిన వామపక్షాలు

కార్మికుల సమ్మెతో కేంద్రం దిగి రావాలి