
నేటికీ ప్రారంభం కాని పనులు
కొత్తపాలెం – కోటప్పకొండ రోడ్డు పనులకు రెండు నెలలు క్రితం టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అయినా నేటి వరకు రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. వెట్‌మిక్స్ వేసిన రోడ్డుపై ప్రస్తుతం కంకర బయటపడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరికే రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించినా.. నేటికీ రోడ్డు పనుల్లో పురోగతి లేకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగా ప్రకటనలకే పరిమితమైందని, ఆచరణ ఉండదని స్థానికులు విమర్శిస్తున్నారు.
రోడ్డు నిర్మాణానికి నిధులు
మంజూరు చేసినట్లు ‘ఎక్స్’లో ఉప ముఖ్యమంత్రి పోస్టు