
భక్తజన సంద్రం.. వైకుంఠపురం
అమరావతి: తొలి ఏకాదశి సంద ర్భంగా మండలంలోని పుణ్యక్షేత్రాలైన అమరావతి, వైకుంఠపురం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వైకుంఠపురం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తులు వైకుంఠపురం క్షేత్రంలో కృష్ణానది ఉత్తర వాహినిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైన స్వయంభూగా వెలసిన వేంకటేశ్వరుని దర్శించారు. అనంతరం కొండకింద వేంచేసియున్న వేంకటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే స్వామివారికి పంచామృత స్నపనానంతరం విశేష అలంకారం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. దేవదాయశాఖాదికారులు కొండపైన, కొండకింద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే పెదమద్దూరు చెందిన భక్తబృందం నిర్వహించిన భజనలు, వైకుంఠపురం భక్తులు ప్రదర్శించిన కోలాటం భక్తులను అలరించాయి.

భక్తజన సంద్రం.. వైకుంఠపురం

భక్తజన సంద్రం.. వైకుంఠపురం