
సమగ్ర ఆరోగ్య ప్రచారం
నరసరావుపేట రూరల్: మండలంలోని రావిపాడులో శనివారం సమగ్ర ఆరోగ్య ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆదేశానుసారం జిల్లా వైద్యారోగ్య శాఖ, ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవీ ఆధ్వర్యంలో 104 సిబ్బందితో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సుమారు 40మందికి హెచ్‌ఐవీ, సిఫిలిస్ పరీక్షలతో పాటు హెపటైటిస్ బీ, సీ రక్త పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. పమిడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీఆర్ జోయెల్ ప్రసాద్, ఏఎన్‌ఎం నాగమల్లేశ్వరి, ఐసీటీసీ కౌన్సిలర్ రవి తదితరులు పాల్గొన్నారు.