
పటిష్ట బందోబస్తు
గతేడాది రషీద్ హత్య నేపథ్యంలో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం. తిరునాళ్లకు జిల్లావ్యాప్తంగానే కాకుండా పక్క జిల్లా నుంచి 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టాం. కొండపైనా, కింద 82 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కొండ కింద పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానం చేశాం. ప్రధాన కూడళ్లలో కూడా పటిష్ట భద్రతతోపాటు, ఫ్లైయింగ్ టీంలను ఏర్పాటు చేశాం. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో 42 మందిపై బైండోవరు కేసులు నమోదు చేశాం. కొంత మందిని హౌస్ అరెస్టు చేశాం. మరికొంత మందిని ఊరు విడిచి పెట్టి వెళ్లాలని ఆదేశాలిచ్చాం. గత నాలుగు రోజుల నుంచి రాత్రి 10 గంటలకే వ్యాపార దుకాణాలు మూసివేయిస్తున్నాం. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది.
– శోభన్ బాబు,
సర్కిల్ ఇన్‌స్పెక్టర్, వినుకొండ
●